శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన 50వ చిత్రం గేమ్ చేజర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలో నటిస్తూ తమన్ సంగీతాన్ని అందించిన చిత్రంగా 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కావడం జరిగింది. భారీ బడ్జెట్ తో ఎన్నో అంచనాలుతో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రావడం జరిగింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే...
కథ :
ఐపీఎస్ నుండి ఐఏఎస్ కు మారిన ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ తన ఐఏఎస్ ప్రయాణంలో వైజాగ్ కు కలెక్టర్గా నియామకం అవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీకాంత్ కొడుకు ఎస్ జె సూర్య. పూర్తిగా పొలిటికల్ డ్రామా చిత్రమైన ఈ కథలో ఏం జరుగుతుంది? రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య పోరాటం ఎలా ఉంటుంది? ఈ విషయంలో శ్రీకాంత్, సముద్రఖని పాత్రలు ఎలా ఉండనున్నాయి? వీరి మధ్యలో జరిగిన ఘర్షణ ఇటువంటివి? రామ్ చరణ్ జీవితంలోకి కియారా అద్వానీ ఎలా వస్తుంది? అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ ఏంటి? అంజలి పాత్ర ఎంతవరకు? అనే ఎన్నో ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన :
చిత్రంలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రామ్ చరణ్ నటన గురించి. ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా మంచి పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఈ చిత్రంలో కూడా నటనతో అందరిని పంపించారు. అదేవిధంగా ఎస్ జె సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, సునీల్ తమనైన పాత్రలో పూర్తిగా న్యాయం చేస్తూ ఎంతో బాగా నటించడం జరిగింది. కియారా అద్వానీ, నవీన్ చంద్ర, అంజలి, జయరాం తమ పరిధిలో తాము నటిస్తూ చిత్రానికి అడిషనల్ సపోర్టుగా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
సినిమా కథ సాధారణంగా ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ డ్రామాను కచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయడంలో శంకర్ అక్కడ తడబడినప్పటికీ ఓవరాల్ గా సినిమా మొత్తంలో సక్సెస్ చేయడమే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇటువంటి కథలు కాస్త అటు ఇటుగా వచ్చినప్పటికీ ఈ సినిమాలో ముందుగా మనం చూడవలసింది డైరెక్షన్ ఇంకా స్క్రీన్ ప్లే. నిర్మాణ విలువలో ఎటువంటి కాంప్రమైజ్ అనేది కనిపించలేదు. చిత్రానికి తగ్గట్లు పాటలు ఎంతో ఘనంగా ఉన్నాయి. సినిమాకు ఎక్కడికక్కడ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకా కాస్ట్యూమ్స్ తో చాలా రిచ్ లుక్ ఇవ్వడం జరిగింది. డబ్బింగ్ కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం లెగ్ అనిపించినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, నిర్మాణ విలువలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్.
సారాంశం:
ఒక మంచి ఫుల్ లెన్త్ పొలిటికల్ డ్రామా చూడాలంటే తప్పకుండా కుటుంబంతో సహా చూడదగిన చిత్రం గేమ్ చేంజర్.
ఫైనల్ గా...
థ్రిల్లింగ్ పొలిటికల్ డ్రామా
రేటింగ్ - 3/5
గేమ్ చేంజర్ మూవీ రివ్యూ
Reviewed by firstshowz
on
1:29 pm
Rating: 5
No comments