జనవరి 24న రాబోతోన్న ‘హత్య’ అందరినీ ఆకట్టుకుంటుంది.. ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకురాలు శ్రీవిద్యా బసవ
మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో..
దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. మధ మూవీని చాలా మందికి చూపించి రిలీజ్ చేయమని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా టీం కూడా ఈ సినిమాను చూసి ఫుల్ హ్యాపీగా ఉంది. మేం తప్పులు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్‌ను నేర్చుకున్నాం. రవి గారు అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. సుధ పాత్రలో ధన్య అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో ప్రిపేర్ అయి సెట్స్‌కు వస్తుంది. సలీమ కారెక్టర్‌లో పూజ మెప్పిస్తుంది. నేను ఓ మహిళా దర్శకురాలిగా.. మరిన్ని ఉమెన్ సెంట్రిక్ కథలు, కారెక్టర్‌లను రాయాలని అనుకుంటున్నాను. మా కెమెరామెన్ అభి సింక్‌లో పని చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నరేష్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. అనిల్ ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘నన్ను నమ్మి ఇంత పెద్ద పాత్రను నాకు ఇచ్చిన విద్యకు థాంక్స్. చిన్నప్పటి నుంచి నాకు విజయశాంతి, మాలాశ్రీలా యాక్షన్ చిత్రాలు చేయాలని ఉండేది. ఇప్పటికి ఆ కల నెరవేరింది. ఈ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మా చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాను అందరూ చూడండి. నచ్చితే అందరికీ చెప్పండి’ అని అన్నారు.
పూజా రామచంద్రన్ మాట్లాడుతూ.. ‘మళ్లీ తెలుగు పరిశ్రమకు రావడం ఆనందంగా ఉంది. ఇక్కడ నాకు ఎంతో ప్రేమ లభిస్తుంటుంది. స్వామి రారా నుంచి నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన శ్రీవిద్యకు థాంక్స్. ధన్యతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. డీఓపీ అభి, డైరెక్టర్ విద్య ద్వయం అద్భుతంగా పని చేసింది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ శ్రీవిద్యకు థాంక్స్. మా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాకు నేను ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. నాకు ఆ అవకాశం ఇచ్చిన దర్శకురాలికి థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హత్య ఈవెంట్‌కు వచ్చిన వారందరికీ థాంక్స్. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమరన్ మాట్లాడుతూ.. ‘వారం రోజుల్లో ఓ సినిమాను పూర్తి చేస్తానా? అని అనిపించింది. మా లిరిసిస్ట్ గాంధీ నా ప్రోగ్రామర్ కూడా. నాతో చాలా ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాడు. మా డైరెక్టర్, యాక్టర్, డీఓపీ, ఎడిటర్‌లు అద్భుతంగా పని చేశారు. జనవరి 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
కెమెరామెన్ అభిరాజ్ రాజేంద్రన్ మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్ విద్య ఎంతో మంది మహిళలకు స్పూర్తి. హత్య సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. పూజా, ధన్య అధ్బుతంగా నటించారు. నరేష్ మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. జనవరి 24న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
ఎడిటర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘హత్య టీజర్, ట్రైలర్ అందరూ చూశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీశారు. హత్య చిత్రంలో చాలా కోణాలు ఉంటాయి. అవేంటో మీకు జనవరి 24న తెలుస్తాయి’ అని అన్నారు.
నటీనటులు : ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన & దర్శకత్వం: శ్రీ విద్యా బసవా
నిర్మాత: ఎస్ ప్రశాంత్ రెడ్డి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అభిరాజ్ రాజేంద్రన్ నాయర్
సంగీత దర్శకుడు: నరేష్ కుమారన్ పి
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ శ్రీకాంత్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: ఎస్ ప్రశాంత్ రెడ్డి
సౌండ్ డిజైన్: సింక్ సినిమా- సచిన్ సుధాకరన్, హరిహరన్
సౌండ్ మిక్స్: అరవింద్ మీనన్
No comments