ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్
అగ్ర కథానాయకుడు అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయర్చి’. ‘పట్టుదల’గా విడుదల చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ‘పట్టుదల’ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్, ప్రమోషనల్ కంటెంట్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లే క్రమంలో మేకర్స్ ‘పట్టుదల’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే..అజిత్ స్టైలిష్‌గా సాల్ట్ అండ్ పేపర్ లుక్‌తో నెవర్ బిఫోర్ అవతార్‌లో మెప్పించబోతున్నారు. ట్రైలర్‌లో తన వాళ్ల కోసం అజిత్ విలన్స్‌తో చేస్తున్న పోరాటాలు, అజిత్, చార్మింగ్ బ్యూటీ త్రిష మధ్య కుదిరిన క్యూట్ కెమిస్ట్రీతో పాటు అజర్ బైజాన్‌లో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అబ్బురపరుస్తున్నాయి. మరో వైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఓ వైపు జైలులో ఖైదీగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రెజీనా కసాండ్ర సైతం ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో అలరిస్తుందని ట్రైలర్‌లో ఆమెను చూస్తుంటేనే అర్తమవుతుంది. . ఇంకా ఈ చిత్రంలో ఆరవ్, నిఖిల్ నాయర్ తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించనున్నారు.
ఓంప్రకాష్ విజువల్స్ సినిమా లుక్‌ను పూర్తిగా మార్చేయటమే కాదు, బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడబోతున్న ప్రేక్షకులకు పట్టుదల సినిమా ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందనిపించేలా ఉంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్, రాక్‌స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన తనదైన శైలిలో మరో సూపర్బ్ ట్యూన్‌తో, బీజీఎంతో ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు పట్టుదల సినిమాపై ఉన్న అంచనాలు ఈ ట్రైలర్‌తో పీక్స్‌కి చేరుకున్నాయి.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా, ఎన్.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఇంకా ఈ చిత్రానికి సుందర్ స్టంట్స్‌ను కంపోజ్ చేయగా, అను వర్ధన్ కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పని చేశారు. సుబ్రమణియన్ నారాయణన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, జె.గిరినాథన్, కె.జయశీలన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్‌గా వర్క్ చేశారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్), గోపీ ప్రసన్న (పబ్లిసిటీ డిజైనర్), హరిహరసుతన్(వి.ఎఫ్.ఎక్స్), సురేష్ చంద్ర (పి.ఆర్.ఒ-తమిల్), నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (పి.ఆర్.ఒ - తెలుగు) సినిమాలో భాగమయ్యారు.
అజిత్ కుమార్ ‘పట్టుదల’ (విడాముయర్చి) సినిమా శాటిలైట్ హక్కులను సన్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుంది.
హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘పట్టుదల’ ట్రైలర్ విడుదల..సాల్ట్ అండ్ పెప్పర్ స్టైలిష్ లుక్‌లో దుమ్మురేపుతోన్న స్టార్ హీరో
Reviewed by firstshowz
on
7:57 pm
Rating: 5
No comments