ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు ట్రయిలర్ గ్రాండ్ రిలీజ్
రాజాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు'. తెలుగులోనే కాదు ప్రపంచ సినిమా చరిత్రలోనే ఎవరు చేయని విధంగా ఒకే షాట్లో సినిమా మొత్తాన్ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యశకితులను చేశాడు ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్, హీరో. అంతే కాకుండా ఇంతవరకు ఎవరు చేయలేని రీతిలో ట్రయిలర్ ను సైతం ఎంతో వినుత్నంగా, ఎంతో వైవిధ్యభరితంగా కట్ చేసి.. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఎంతో గ్రాండ్ గా జరిగిన ట్రయిలర్ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి విశేషాలు తెలుసుకుందాం. ఈ సందర్భంగా హీరో సూపర్ రాజా మాట్లాడారు.
ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనకోసం మహబూబాబాద్, నెల్లూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సినిమాను తెరకెక్కించడమే కాదు ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేసినట్లు వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 నగరాల్లో 924 ప్రమోషన్లు చేసినట్లు తెలిపారు. సినిమా గురించి కరపత్రాలను ప్రింట్ కొట్టించి, జనాలకు పంచారు. ఇలాంటి ప్రమోషన్లు ఎప్పుడూ చూసి ఉండరు అన్న రీతిలో ప్రమోషన్స్ చేసినట్లు హీరో సూపర్ రాజా తెలిపారు. సినిమా కోసం తన శ్రమను కష్టాన్ని తాపత్రాన్ని చూసి సామాన్య ప్రేక్షకులు నేడు అభిమానులుగా మారారని, తాను నటించిన సినిమా విడుదల కాక ముందుకే అభిమానుల్ని ఏర్పాటు చేసుకున్న ఘనత తనకే చెల్లిందని వివరించారు.
ఇంత వినూత్నంగా ఉన్నా ట్రయిలర్ కోసం ప్రత్యేకమైన స్క్రిప్టు రాసి షూట్ చేసిన క్రెడిట్ కూడా తమకే సొంతమని చెప్పారు. ఇక సినిమా అంతా సింగిల్ షాట్లో షూట్ చేసినట్టు.. ఇలాంటి ప్రయోగం ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పారు. అయితే ఆక్టింగ్ లో మెథడ్ ఆక్టింగ్ ఉంటుంది అని, అది తెలుగు లో చిరంజీవి, మోహన్ బాబు, తమిళ్ లో రజినీకాంత్ మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుని ఆక్ట్ చేసారు. ప్రపంచం లో చాలామంది నటులు ఆ మెథడ్ నే ఫాలో అవుతారని, అయితే ఆ సిస్టం సింగల్ షాట్ సినిమా కి పని చేయదు, షాట్ బై షాట్ సినిమా కి పని చేస్తుందని, ఈ సినిమా కోసం సూపర్ రాజా ఒక కొత్త యాక్టింగ్ స్టైల్ ని కనిపెట్టారని తెలిపారు. ఈ ప్రయోగాన్ని ఎంతో అద్భుతంగా తెరపై ప్రతిబింబించేలా చిత్రీకరించినట్లు సూపర్ రాజా వెల్లడించారు.
ఈ సినిమాలో హీరో సూపర్ రాజా తో పాటు ముఖ్యమైన పాత్రలో కనిపించిన థియేటర్ ఆర్టిస్ట్ వంశీ గోనె మాట్లాడుతూ దాదాపు 100 నిమిషాల నిడివి ఉండే ఈ సింగల్ షార్ట్ ఎక్స్పరిమెంట్ మూవీలో తనకు పాత్ర చేసే అవకాశం రావడం అదృష్టమని, అందుకు కారణమైన సూపర్ రాజాకు కృతజ్ఞతలు తెలిపారు. ముందు స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించిందని ఒకే షాట్ లో 1400 డైలాగులు చెప్పడం అనేది చాలా క్రేజీ థాట్ అని పేర్కొన్నారు. ఈ ఐడియాను సూపర్ రాజా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడో అన్న డౌట్ ఉండేదని, ఒకసారి సూపర్ రాజా విజన్, మేకింగ్ ప్రాసెస్, రిహార్సల్స్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పారు. కోవిడ్ టైంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ ముందు చిన్న చిత్రంగా మొదలై ఇప్పుడు థియేటర్లో విడుదలవడం అనేది సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా షూటింగ్ గాయాలు కూడా అయినట్లు చెప్పారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని కచ్చితంగా మీడియా మిత్రులు సినిమాను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
హీరోయిన్ చందన మాట్లాడుతూ.. ఈ సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ లో నటించినట్లు చెప్పారు. సినిమా అంటే ఎంతో ఫ్యాషన్ ఉన్నా నటుడు, రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్ సూపర్ రాజా ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా క్రేజీగా అనిపించిందని, షూటింగ్ ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నానని వెల్లడించారు. ప్రతిరోజు సూపర్ రాజా ఎంతో కష్టపడేవాడని యాక్టింగ్, డైరెక్షన్ చూసుకోవడం అంటే మామూలు విషయం కాదని, కచ్చితంగా ఈ సినిమా సూపర్ రాజాకు మంచి సక్సెస్ తీసుకొస్తుందని.. కచ్చితంగా అందరూ ఈ సినిమాను ఆదరించాలని పేర్కొన్నారు.
కీలక పాత్రలో నటించిన రమ్య ప్రియ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కళామతల్లి క్యారెక్టర్ ప్లే చేసినట్లు చెప్పారు. ఈ పాత్ర ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని అన్నారు. ఈ క్యారెక్టర్ ఇచ్చిన సూపర్ రాజా కు ధన్యవాదాలు తెలిపారు.
హీరో సూపర్ రాజా తల్లి అన్నపూర్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన మొదటి ఆడియన్ తనేనని చెప్పారు. సినిమా చూసిన కాన్ఫిడెన్స్ తో చెబుతున్న.. చిత్రం చాలా బాగుందని, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పారు. మొదట సూపర్ రాజా సినిమాల్లోకి వెళ్తున్న అన్నప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు కదా అని భయపడ్డానని, ఎలా తీస్తాడో, తన ఫ్యూచర్ ఏమవుతుందో అనే ఆలోచన ఉండేదని, కానీ సినిమా చూసిన తర్వాత నా కొడుకు హీరోనే కాదు స్టార్ హీరో అవుతాడని పేర్కొన్నారు.
హీరో అన్నయ్య మాట్లాడుతూ.. మంచి ఉద్దేశంతో మంచి కథను వినూత్నంగా అందించాలని ప్రయత్నంలో సూపర్ రాజా ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసి ఉండరు అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడని కచ్చితంగా అందరూ ఆదరించాలని తెలిపారు.
చివరగా సూపర్ రాజా మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి ఎన్ని కష్టాలు పడతారో అన్ని కష్టాలు తాను పడ్డట్లు పేర్కొన్నారు. తన పేరెంట్స్, అన్నయ్య తమ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టుబడి పెట్టారని వెల్లడించారు. ఎంతో కసితో, ఎంతో ఫ్యాషన్ తో చిత్రాన్ని తెరకెక్కించామని ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, వాళ్ళ అన్నయ్యకు, అక్కయ్యకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం మరో ఎత్తు అని, అందుకే ఎవరు చేయని రీతిలో ప్రమోషన్స్ చేసి ఈరోజు వేల మంది సినిమా కోసం వేచి చూసేలా చేశానని తెలిపారు. ఈ చిత్రం 2025 ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని తెలిపారు.
చిత్రం : ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు
బ్యానర్ : రాజా కృష్ణ ప్రొడక్షన్స్
నటీనటులు: సూపర్ రాజా, వంశీ గోనె, చందన పాలంకి, రమ్య ప్రియ, తదితరులు
రచయిత: సూపర్ రాజా
దర్శకుడు: సూపర్ రాజా
నిర్మాత: సూపర్ రాజా
మ్యూజిక్ డైరెక్టర్: సిద్దార్థ్ శివదాసని, సబు వర్గీస్
No comments