పూజా కార్యక్రమాలతో ఘనంగా 'ప్రేమ కలహం' సినిమా ప్రారంభోత్సవం

సందీప్ పొడిశెట్టి నిర్మాణ దర్శకత్వంలో సచిన్ రామ్ ప్రతాప్ హీరోగా విశ్వ అక్షర హీరోయిన్గా జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ప్రేమ కలహం. ఈరోజు ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఎంతో ఘనంగా మొదలయ్యింది. మల్లికార్జున్ డిఓపిగా పనిచేస్తున్న ఈ చిత్రానికి ఎమ్మెన్నార్ ఎడిటర్ గా చేస్తుండగా చిత్రానికి సంగీతాన్ని కూడా సందీప్ పొడిశెట్టి అందించడం విశేషం. 

లవ్ అండ్ ఎమోషన్ జోనర్లో రానున్న ఈ చిత్రం ప్రారంభిస్తున్న ఈ క్రమంలో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ... "ఈ చిత్రం మంచి హిట్ అవుతుంది అని ఎంతో విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను" అన్నారు. 

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, నటీనటులు, అలాగే ఇతర సాంకేతిక బృందం హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

నటీనటులు : సచిన్ రామ్ ప్రతాప్, విశ్వ అక్షర. 

సాంకేతిక బృందం: 

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాణం - సందీప్ పొడిశెట్టి 
డిఓపి - మల్లికార్జున్
ఎడిటర్ - ఎంఎన్ఆర్ 
సంగీతం - సందీప్ పొడిశెట్టి 
పబ్లిసిటీ డిజైనర్ - సింహాచలం టి 
కాస్ట్యూమ్ డిజైనర్ - సోము ఆర్

No comments