రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు సందర్బంగా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ గ్లింప్స్ రిలీజ్‌కు సన్నాహాలు - ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ పోస్టర్‌ను విడుదల చేసిన హీరో యష్.. బర్త్ డే రోజున సర్‌ప్రైజ్‌కు సిద్ధం కావాలన్న స్టార్
రాకింగ్ స్టార్ యష్.. కె.జి.యఫ్ ఫ్రాంచైజీ చిత్రాలతో గ్లోబల్ రేంజ్ స్టార్ డమ్‌ను సొంతం చేసుకున్న కథానాయకుడు. ఈ సినిమాతో అన్నీ రికార్డులను క్రాస్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశారు యష్. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. రా లుక్‌తో కనిపిస్తోన్న పోస్టర్‌లో తెలియని రహస్యమేదో దాగుందని అర్థమవుతుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.
యష్ తన సోషల్ మీడియాలో పోస్టర్‌ను పోస్ట్ చేసి, అతన్ని పరిచయం చేయబోతున్నాం అంటూ రాశారు. పోస్టర్‌ను గమనిస్తే టక్సెడో, ఫెడోరా డ్రెస్‌లో యష్ ఓ వింటేజ్ కారుని అనుకుని స్టైల్‌గా సిగరెట్ తాగుతున్నారు. ‘అతని అంతులేని ఉనికి మీ అస్తిత్వానికి సంక్షోభం’ అనే ట్యాగ్ లైన్ అతని నిగూఢమైన ప్రయాణాన్ని తెలియజేస్తోంది.
.
పోస్టర్ ఇంటర్నేషనల్ లుక్‌లో కనిపిస్తోంది. యష్ రాబోతున్న సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’పై అంచనాలను పెంచుతోంది. చీకటి, నిగూఢంగా దాగిన అర్థం అనేవి కఠినమైన, చక్కటి కథనాన్ని తెలియజేస్తుంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10 గంటల 25 నిమిషాలకు సర్‌ప్రైజ్‌నిస్తామిన ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.
టాక్సిక్..ఫెయిరీ టేల్ గ్రోనప్స్నేది డిఫరెంట్ జోనర్‌లో ఇంటెన్స్ కథతో రూపొందిన సినిమాగా తెలుస్తోంది. కథానాయకుడికి సంబంధించిన విషయాలను తెలియజేస్తామంటూ చెప్పిన అన్‌లీషింగ్ హిమ్ లైన్ చూస్తుంటే హీరో పాత్రలోని పవర్, సంక్లిషతను తెలియజేస్తోంది. అస్తిత్త సంక్షోభం అనేది రొటీన్ కథలా కాకుండా సరిహద్దులను దాటే కథగా తెలుస్తోంది.
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు దగ్గర పడుతుండటంతో 2025లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం అభిమానులు సహా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్’ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు మేకర్స్.
No comments