‘జాక్- కొంచెం క్రాక్’లో మరో వైవిధ్యమైన పాత్రతో అలరించనున్న వైష్ణవి చైతన్య.. బర్త్ డే పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్
బేబి, లవ్ మీ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇప్పుడు మరో క్రేజీ సినిమాలో సరికొత్త పాత్రతో మనల్ని మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఆ సినిమాయే ‘జాక్- కొంచెం క్రాక్’. డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న సినిమా ఇది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఇందులో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా అలరించనుంది. శనివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు విషెష్ తెలియజేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో చూపరులను ఆకట్టుకునేలా వైష్ణవి చైతన్య లుక్ ఉంది.
జాక్ - కొంచెం క్రాక్ చిత్రంలో ఆమె రోల్ మరింత డిఫరెంట్‌గా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్- కొంచెం క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఈ ఫన్ రైడర్‌లోఇంకా ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. అచ్చు రాజమణి సంగీత సారథ్యం వహిస్తున్నారు.
No comments