మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర "బుల్లి అబ్బాయి కోడి పులావ్" ప్రారంభం
మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని వ్యాల్యూ మార్ట్ ఎదురుగా "బుల్లి అబ్బాయి కోడి పులావ్" టేక్ అవే రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ, “బుల్లి అబ్బాయి కోడి పులావ్ పేరు ఎంతో క్యాచి గా ఉంది. ఇది హాస్టల్స్ లో, రూమ్స్ లో నివసించే విద్యార్థులు, ఉద్యోగులకు అందుబాటులో ఉండేలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అందిస్తారు. ఈ తొలి బ్రాంచ్ విజయవంతమై, త్వరలోనే హైదరాబాద్ అంతా మరియు ఆంధ్ర, తెలంగాణలలో విస్తరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడి వంటలు రుచి చూశాను. ఎంతో బాగున్నాయి. ప్రారంభించిన సునీల్, మణి, భాస్కర్ లకు అభినందనలు తెలియజేస్తున్నాను,” అన్నారు.
"బుల్లి అబ్బాయి కోడి పులావ్" ప్రత్యేకతగా బాస్మతి మరియు గిద్ద మసూరి రైస్ తో పులావ్ తయారు చేస్తారు. ఈ స్టార్ట్-అప్ లో మూడుస్నేహితుల శ్రమ ఫలితంగా కొత్త మెనూలతో పాటు వినియోగదారులకు మరింత రుచికరమైన అనుభవం అందించనున్నారు.
No comments