పూర్ణ ప్రదాన పాత్రలో P19 ట్రాన్సమీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ళ వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ థ్రిల్లర్ కథా చిత్రం "డార్క్ నైట్". ఈ చిత్రాన్ని జి.ఆర్.ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణ ఆమె సరసన కథ, వీకెండ్ లవ్,పి వి ఎస్ గరుడవేగా,24 కిస్సెస్, కథ కంచికి మనం ఇంటికి, ప్రేమదేశం, మనమే వంటి చిత్రాలలో నటించిన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్), నటించగా విధార్థ్, సుభాశ్రీ రాయగురు, మిగతా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కి సిధమైంది. కాగా ఈ రోజు ఉదయం దర్శకుడు వి వి వినాయక్ చేతుల మీదుగా చిత్రానికి చెందిన రిలీజ్ ను సోనీ మ్యూజిక్ ద్వార విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డైనమిక్ డైరెక్టర్ వి వి వినాయక్ మాట్లాడుతూ : " సురేష్ రెడ్డిగారు మా ప్రాంతం నుండి వచ్చి నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు డార్క్ నైట్ చిత్రంతో పరిచయం అయ్యారు చాలా సంతోషం. ప్రస్తుతం థ్రిల్లర్ కథ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు ముఖ్యంగా యూత్, P19 ట్రాన్సమీడియా స్టూడియోస్ బ్యానర్ లో తొలి చిత్రంగా పూర్ణ, త్రిగుణ్ మెయిన్ లీడ్ గా వస్తున్నడార్క్ నైట్ తప్పక విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం విజయం తో ఆయన మరిన్ని చిత్రాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ లో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను." అన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : "మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు డైనమిక్ డైరెక్టర్ వి వి వినాయక్ గారికి ధన్యవాదాలు. తెలుగులో ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన 'అవును 1,' అండ్ 'అవును 2' చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది, ఆ చిత్రాల తోనే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాలకు అతీతంగా డార్క్ నైట్ లో ఆమె నటన హైలెట్ గా నిలుస్తుంది. మళ్ళి ఇన్నాలకు ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు అనుగుణంగా ఎమోషనల్ గా సాగే థ్రిల్లర్ కథతో "డార్క్ నైట్" చిత్రం నిర్మించబడింది. తమిళ్ రచయిత, దర్శకుడు జి.ఆర్.ఆదిత్యా ఈ చిత్రాన్ని ఆద్యంతం అధ్బుతంగా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విదంగా ఈ చిత్రాన్ని మలిచాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు. అన్ని విదాల ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది "డార్క్ నైట్" చిత్రం, మరియు చివరి వరకు వారిని వారి సీట్లకు హత్కునే విదంగా సన్నివేశాలు వుంటాయి. ఒక విదంగా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్ గా ఎమోషనల్ రోలర్ కోస్టర్‌లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మిస్కిన్ సిగ్నేచర్ BGMతో, స్వరపరిచిన నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్ విజువల్స్ కు ఊపిరి పోసాడు. ప్రస్తుతం ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చ్ సెకండ్ వీక్ లో గాని, థర్డ్ వీక్ లో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. " అన్నారు.
నటినటులు : పూర్ణ, విధార్ద్, త్రిగుణ్ (ఆదిత్ అరుణ్),సుభాశ్రీ రాయగురు,రమా తదితరులు నటించారు.
సాంకేతిక వర్గం :
నిర్మాణ సంస్థ : P 19 ట్రాన్సమీడియా స్టూడియోస్,
సంగీతం : మిస్కిన్,
సినిమాటోగ్రఫీ : కార్తీక్ ముథుకుమార్,
ఎడిటర్ : ఎస్ ఇళయరాజా,
సహా నిర్మాతలు :శ్రీనివాస్ మేదరమెట్ల, జమ్ముల కొండలరావు,
సమర్పణ : పటోళ్ళ వెంకట్ రెడ్డి,
నిర్మాత: సురేష్ రెడ్డి కొవ్వూరి,
కథ, దర్శకత్వం : జి.ఆర్.ఆదిత్య
పి.ఆర్.ఓ : రాంబాబు వర్మ
డైనమిక్ డైరెక్టర్ వి వి వినాయక చేతులమీదుగా స్టన్నింగ్ అండ్ ఎగర్నెస్ మూవీ "డార్క్ నైట్" టీజర్ రిలీజ్
Reviewed by firstshowz
on
10:25 pm
Rating: 5
No comments