కథ మీద ఇష్టం, నమ్మకంతో రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిన సినిమా 'బాపు'. తప్పకుండా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది: వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ

వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా 'బాపు'. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్‌ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బ్రహ్మాజీ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

బాపు జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ?

-డైరెక్టర్ దయ రెండేళ్ళ క్రితం కథ చెప్పారు. పాయింట్ చాలా కొత్తగా వుంది. క్యారెక్టర్ కూడా డిఫరెంట్ గా వుంది. ఒరిజినల్ గా కనిపించే అవకాశం ఇచ్చే స్క్రిప్ట్. అయితే దీనికి బడ్జెట్ లేదు. ఎలా చేద్దామని అనే చర్చ జరుగుతున్నప్పుడు..నాకు రెమ్యునరేషన్ వద్దు. లాభాలు వస్తే కొంత మనీ ఇమ్మని చెప్పి అలా స్టార్ట్ చేశాం. తర్వాత అందరూ తగ్గించి చేయడం, లొకేషన్ లో కార్వాన్ లేకుండా అదే ఊర్లో ఉంటూ అక్కడే సర్దుకుపోవడంతో ఇది చేయగలిగాం. కథపై ఇష్టం నమ్మకంతోనే ఇది సాధ్యపడింది.

కథలో నచ్చిన ఎలిమెంట్ ఏమిటి ?

-చాలా యూనిక్ కాన్సెప్ట్. రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. అలా నా క్యారెక్టర్ సూసైడ్ కి ట్రై చేసినప్పుడు ఏమౌతుందనేది సినిమాలో చూడాలి.

ఆమని గారి క్యారెక్టర్ గురించి ?

-ఆమని గారు చాలా నేచురల్ యాక్టర్. చాలా మంచి సినిమాలు చేసిన మంచి ఆర్టిస్ట్. ఆమెతో కలసి వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్. ఇందులో ఆమని గారి క్యారెక్టర్ స్ట్రాంగ్ గా వుంటుంది.

ఫైనల్ కాపీ చుసినప్పుడు ఏమనిపించింది ?

సినిమా చాలా బావుంది. ఇప్పుడు చిన్న సినిమాలకి ఓటీటీ అవ్వడం లేదు. మా అదృష్టం .. ఈ సినిమాని హాట్ స్టార్ వాళ్ళు తీసుకున్నారు. థియేటర్ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.

బలగం సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి ?

-ఆయనదే టైటిల్ రోల్. కథలో ఆయనే మెయిన్. ఆ క్యారెక్టర్ తో ఆడియన్స్ చాలా కనెక్ట్ అవుతారు.

ఈ సినిమాకి అవార్డులు ఆశిస్తున్నారా ?

-అవార్డులు గురించి ఆలోచన లేదు. మంచి సినిమా చేయాలనేది మా ప్రయత్నం. అవార్డ్స్ వస్తే హ్యాపీ.

సినిమాకి ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వుంది ?

-ఈ సినిమాకి ఇండస్ట్రీలో వున్నవారంతా హెల్ప్ చేశారు. రానా గారు ఫస్ట్ లుక్ రిలీజ్. ట్రైలర్ లాంచ్ కి అప్పటికప్పుడు పిలిచినా వచ్చారు. ఆయన ఇలాంటి చిన్న సినిమాలకి చాలా సపోర్ట్ ఇస్తారు. రస్మిక టీజర్ రిలీజ్ చేసింది. మొన్న ఈవెంట్ కి అందరూ పిలవగానే వచ్చారు. అందరి సహకరంతో ఈ సినిమా జనాల్లోకి వెళ్ళగలుగుతుంది.

బాపు మ్యూజిక్ గురించి ?

ఈ సినిమాకి సాంగ్స్ చాలా హెల్ప్ అయ్యాయి. రెండు పాటలు బాగా పాపులర్ అయ్యాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

డైరెక్టర్ దయ గరించి ?

-దయ చాలా మొండి డైరెక్టర్. విన్నట్లు నటిస్తాడు కానీ వినడు. ఆయనకి అనిపించింది చేస్తాడు.(నవ్వుతూ) తనలో చాలా క్లారిటీ వుంది. డైరెక్షన్ మీద పట్టుంది. చాలా నాలెడ్జ్ వున్న పర్శన్.

బాపు సినిమాకి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ?

-ఇప్పటివరకూ సినిమా చూసి ప్రతిఒక్కరూ చాలా బావుందని ఫోన్ లు చేస్తున్నారు. జనరల్ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి గారికి సినిమా చూపించాను. ఆయనకి చాలా నచ్చింది.  

ఈ సినిమాని చాలా మంది బలగంతో పోల్చుతున్నారు ?

-అది మంచిదే కదా. అందులోనూ బలగం సుధాకర్ గారు వుండటంతో ఆ పోలిక మరింతగా వస్తోంది. అయితే బలగం సినిమాకి దీనికి ఏ మాత్రం పోలిక లేదు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు.  

మీకు డ్రీమ్ రోల్ ఉందా ?

-సూపర్ డీలక్స్ లో విజయ్ సేతుపతి చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం. ఆలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయాలని వుంది.

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది?

-కథ బావుండాలి. అందులో నా పాత్ర బావుండాలి. ప్రతి సినిమాతో ఎదో కొత్తదనం వుండాలి. అలాంటి కొత్త ప్రయత్నంతో చేసిన సినిమా బాపు.

మీకు ఫేవరేట్ జానర్ ?

ఎమోషనల్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. ఎమోషనల్ గా డెప్త్ వున్న సినిమాలు చేయడానికి ఇష్టపడతాను.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి ?

-చిరంజీవి గారి విశ్వంభరలో ఓ క్యారెక్టర్ చేశాను. తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే రాజ్ తరుణ్ తో ఓ సినిమా. సిద్దు జొన్నల గడ్డ జాక్ లో ఓ క్యారెక్టర్ చేశాను.

ఆల్ ది బెస్ట్

థాంక్ యూ

No comments