మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా "చంద్రేశ్వర" మూవీ నుంచి శివుని పాట విడుదల, త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ
శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఎమోషనల్ ఎంటర్ టైనర్ 'చంద్రేశ్వర'. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 'చంద్రేశ్వర' సినిమాలోని శివుని పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ - మహా శివరాత్రి పర్వదినం రోజు 'చంద్రేశ్వర' సినిమా నుంచి శివుని పాటను రిలీజ్ చేయడం గొప్ప సందర్భం. శివుని పాట చాలా బాగుంది. ఆ శివుడి దయ మీ మీద ఉండాలి. ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన నిర్మాత రవీంద్రచారి, దర్శకుడు పెరుమాళ్ వర్థన్ కు అభినందనలు. సినిమా అంటే ప్యాషన్ మాత్రమే కాదు డబ్బు కూడా నిర్మాతకు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ ఈశ్వర్ మాట్లాడుతూ - నిర్మాత రవీంద్రచారి గారు చంద్రేశ్వర మూవీతో మన సనాతన ధర్మం, దేవాలయాల నేపథ్యంతో మంచి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు అంతా మంచే జరగాలని గత వారం ప్రయాగరాజ్ వెళ్లి పూజ చేసి వచ్చారు. ఆయన మన హిందూధర్మం గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటారు. అలా నాకు ఆయన కనెక్ట్ అయ్యారు. ఇటీవల ఛావా సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యింది. అలాగే చంద్రేశ్వర సినిమా పెద్ద విజయం సాధించాలి. రవీంద్రచారి గారు ఇలాంటి మరిన్ని మంచి మూవీస్ చేయాలి. అన్నారు.
నటుడు గాలిపటాల సుధాకర్ మాట్లాడుతూ - చంద్రేశ్వర వంటి మంచి మూవీ చేస్తున్న నిర్మాత రవీంద్రచారికి నా ప్రశంసలు అందిస్తున్నా. ఆయన ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేయాలి. ప్రొడ్యూసర్స్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. మా లాంటి కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. శివుని పాట చాలా బాగుంది. అన్నారు.
జబర్దస్త్ వినోదిని మాట్లాడుతూ - చంద్రేశ్వర పేరులో చంద్రుడు, ఈశ్వరుడు ఉన్నారు. అలాంటి మంచి టైటిల్ తో ఈ సినిమా రావడం సంతోషంగా ఉంది. శివుని పాట చాలా బాగుంది. ఈ సినిమా దర్శకుడు పెరుమాళ్ వర్థన్ గారికి, నిర్మాత రవీంద్రచారి గారికి ఇతర టీమ్ అందరికీ ఈ సినిమా పెద్ద విజయాన్ని అందించాలి. అన్నారు.
జబర్దస్త్ గడ్డం నవీన్ మాట్లాడుతూ - చంద్రేశ్వర సినిమా కంటెంట్ చూస్తుంటే సినిమా తప్పకుండా థియేటర్స్ లో చూడాలి అనిపిస్తోంది. రెండు సాంగ్స్ బాగున్నాయి. శివుని పాట చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి సంజనా చౌదరి మాట్లాడుతూ - చంద్రేశ్వర మూవీలోని శివుని పాట చూస్తుంటి శివరాత్రి పండుగ ఇక్కడే జరుగుతోంది అనిపిస్తోంది. ఈ మధ్య కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ రావడం లేదు. ఇలాంటి టైమ్ లో మంచి కంటెంట్ తో వస్తున్న చంద్రేశ్వర మూవీని ప్రేక్షకులు సక్సెస్ చేయాలి. అన్నారు.
కో ప్రొడ్యూసర్ పి. సరిత మాట్లాడుతూ - చంద్రేశ్వర మూవీలోని శివుని పాట రిలీజ్ తో ఈ శివరాత్రి మాకెంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. మీకు మా మూవీ సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాం. సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు కావాలి. అన్నారు.
కో ప్రొడ్యూసర్ వి. బాలకృష్ణ మాట్లాడుతూ - ముందుగా మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మా చంద్రేశ్వర మూవీలోని శివుని సాంగ్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ ఈవెంట్ లో గెస్ట్ లుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. చంద్రేశ్వర మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ - నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. అయితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు చంద్రేశ్వర మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా. మా మూవీలో ఈశ్వరా అని సాగే ఈ పాటను మహాశివరాత్రి రోజు రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆర్కియాలజీ నేపథ్యంలో ఎమోషనల్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది అనే అంశాలు ఆకట్టుకుంటాయి. డివోషనల్ టచ్ తో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. త్వరలోనే మా చంద్రేశ్వర చిత్రాన్ని మీ ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం అన్నారు.
నటీనటులు - సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, అడుకులం మురుగదాస్ గజరాజ్, జె ఎస్ కే గోపి, తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం: జెరాడ్ ఫిలిక్స్
డిఓపి: ఆర్వి సీయోన్ ముత్తు
సింగర్స్: సాయి చరణ్
లిరిక్స్: వెంకట్, జ్యోతి
డిటిఎస్: శ్యామ్
ఎడిటర్: నందమూరి హరి
పిఆర్వో: బి. వీరబాబు
కో ప్రొడ్యూసర్ పి.సరిత , వి. బాలకృష్ణ
ప్రొడ్యూసర్: డాక్టర్ రవీంద్ర చారి
డైరెక్టర్: జీవి పెరుమాళ్ వర్ధన్
No comments