తకిట తధిమి తందాన ఈనెల 27న బ్రహ్మాండమైన విడుదల

"విలాసాల కోసం అప్పులు చేస్తే 
విలాపాలే" అని వినోదాత్మకంగా
తెలిపే యూత్ ఫుల్ అండ్ థాట్ ఫుల్
ఎంటర్టైనర్ తకిట తధిమి తందాన"

తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కారం జరుపుకుని, భాజపా అగ్రనేత - కేంద్రమంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా టీజర్ విడుదల జరుపుకున్న యూత్ ఫుల్ అండ్ థాట్ ఫుల్ ఎంటర్టైనర్"తకిట తధిమి తందాన"  ట్రైలర్ యూనిట్ సభ్యుల చేతుల మీదుగా లాంచ్ అయ్యింది. ఈ చిత్రంపై ఇప్పటికే ఏర్పడిన అంచనాలు మరింత పెరిగేలా ట్రైలర్ ఉండడం విశేషం!!

"మర్డర్" ఫేమ్ ఘన ఆదిత్య - కొత్తమ్మాయి ప్రియ జంటగా.. రాజ్ లోహిత్ దర్శకత్వంలో ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై.. చందన్ కుమార్ కొప్పుల నిర్మించిన "తకిట తదిమి తందాన" చిత్రం ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినెటేరియా మీడియా వర్క్స్ ఆధ్వర్యంలో విడుదల కానున్న "తకిట తధిమి తందాన" రాజ్ లోహిత్ ప్రతిభకు అద్దం పడుతుందని, జల్సాల కోసం అప్పులు చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వినోదాత్మకంగా చూపించామని నిర్మాత చందన్ కుమార్ కొప్పుల పేర్కొన్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: నరేన్ రెడ్డి, ఎడిటర్: హరి శంకర్, సినిమాటోగ్రఫీ: పి.ఎన్.అంజన్, లిరిక్స్: శ్రేష్ట, కో-రైటర్: దిలీప్ అరుకొండ!!

No comments