Googleలో 4.6/5 యూజర్ రేటింగ్‌తో సర్చింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ‘మిసెస్’

ZEE5 ఫ్లాట్ ఫాంపై రీసెంట్‌గా ‘మిసెస్’ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకుపోతూ జీ5లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం ఆడియెన్స్‌ను మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 7.3 IMDb రేటింగ్‌తో పాటు, గూగుల్‌లో యూజర్ రేటింగ్ 4.6/5తో అత్యధికంగా సర్చ్ చేస్తున్న చిత్రంగా ‘మిసెస్’ సంచలనాలు సృష్టిస్తోంది.

ఈ చిత్నాన్ని గజరాజ్ రావు వంటి సీనియర్ మేకర్, విక్రమాదిత్య మోత్వానే, వాసన్ బాలా, సోనమ్ నాయర్, సుమిత్ పురోహిత్ వంటి ప్రముఖ చిత్రనిర్మాతలు, ప్రముఖ నటీనటులు అలీ ఫజాల్, పుల్కా ఘాబ్, వమీఖ్ ఫజాల్, పుల్కా గ్యాబ్, శ్రియా పిలగావ్కర్, సాకిబ్ సలీమ్, తిల్లోటమా షోమ్, అక్షయ్ ఒబెరాయ్, అమోల్ పరాశర్ వంటి వారు ప్రశంసించారు. బవేజా స్టూడియోస్‌తో కలిసి జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందీ ప్రేక్షకులకు చూడటానికి అందుబాటులో ఉంది.

Catch Mrs. now, streaming exclusively on the ZEE5 app! 

https://www.zee5.com/movies/details/mrs/0-0-1z5689119


ZEE5లో SVOD ఇండియా, గ్లోబల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రేష్ఠ్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘మిసెస్’కి వచ్చిన అసాధారణ ఆదరణ చూసి అందరం సంతోషిస్తున్నాం. సమాజంలో అర్ధవంతమైన మార్పుకు దారితీసే కథనాలకు ZEE5 పెద్ద పీఠ వేస్తుందనే నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటిస్తుంది. ఇలాంటి ఎన్నో సామాజిక సందేశాత్మక కథల్ని అందించేందుకు మున్ముందు ప్రయత్నిస్తూనే ఉంటామ’ని అన్నారు.

చిత్ర దర్శకురాలు ఆరతి కడవ్ మాట్లాడుతూ.. ‘‘మిసెస్’కోసం చేసిన ఈ జర్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంపై వస్తున్న ప్రేమ, కురిపిస్తున్న ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోలేను. ZEE5 ఈ కథకు ప్రాణం పోసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. సన్యా పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులు, మహిళలు తమలో తాము పోల్చుకుంటూ ఉన్నారు.  ఈ ప్రయాణంలో నన్ను నమ్మి అండగా నిలిచి సపోర్ట్ ఇచ్చిన నా నిర్మాత హర్మన్ బవేజా, బవేజా స్టూడియోస్, జియో స్టూడియోస్‌కి కృతజ్ఞతలు’ అని అన్నారు.

నటి సన్యా మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు ‘మిసెస్’ను చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. ఆడియెన్స్ కురిపిస్తున్న ప్రేమను చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఇది కేవలం ఓ కథ కాదు.. శ్రీమతి కేవలం కథ కాదు - ఇది ఒక వాస్తవం, నిజం. ఇలాంటి ఓ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చిన ZEE5కి థాంక్స్. ఆలోచింపజేసే కథాంశంతో వినోదాన్ని మిళితం చేసే ప్రీమియం కంటెంట్‌ను అందించడంలో ZEE5 తన అంకితభావాన్ని ప్రదర్శించింది’ అని అన్నారు. 

No comments