10 రూపీస్ సినిమా తో అందరికి సుపరిచుతుడైన యంగ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్జల్ తన తదుపరి చిత్రం 1000 Waala సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ అవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఆఫ్జల్ ఈ చిత్ర విషయాలు తన సోషల్ మీడియా హేండిల్ లో ఎప్పటికప్పుడు అందరికి అప్డేట్ ఇస్తున్న తరుణం లో రిలీజ్ చేసిన ఒక వీడియో అనుమానాలకు దారి తీసింది.
ఆ వీడియో లో ఆఫ్జల్ "సినిమా రిలీజ్ డేట్ పైన నాకు ఎటువంటి సమాచారం లేదు. అసంతృప్తి గా ఉన్నా.. అయినా పరవాలేదు మా సినిమా ని చుడండి" అని అన్నారు. అయితే ఇటీవలే హీరో అమిత్ ప్రొడ్యూసర్ షారుఖ్ మీమెర్స్ మీట్ లో కొన్ని ప్రశ్నలకి సామాధానం ఇస్తూ డైరెక్టర్ ప్రస్తావన వచ్చేసరికి, ఆంధ్రాలో ప్రొమోషన్స్ వర్క్ లో బిజీ గా ఉన్నారు అని చెప్తుండగా, తన సినిమాకి పని చేసిన ఒక టెక్నీషియన్ దానిని తప్పుపట్టారు.
ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాలని అడగగా హీరో అమిత్, ప్రొడ్యూసర్ షారుఖ్ఈ విషయం మీద కొంత అసంతృప్తి తో నే సమాధానం ఇచ్చారు గానీ ఉన్న విషయాన్ని కరెక్ట్ గా చెప్పలేదు. ఇక్కడే అర్థం అవుతుంది డైరెక్టర్ ని పక్కన పెట్టి ఈ సినిమాని ముందుకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నారు అని.
ఏది ఏమైనా .. అందరు కస్టపడి సినిమాని ముందుకు తీసుకుని వెళ్తే అందరకి మంచి పేరు వస్తుంది. ఆలా కాదని ఒకరే అంతా చేసాము అనడం కరెక్ట్ కాదు అని మా అభిప్రాయం. కనుక మూవీ టీం ఈ విషయం గ్రహించి ముందుకు వెళ్తే అది నిజమైన సక్సెస్.
తనకు తప్ప ఇంకెవరికీ పేరు రాకూడదు అని ప్రమోషన్స్ లో డైరక్టర్ తో సహా టీమ్ అందరినీ తొక్కేసిన 1000వాలా హీరో/ప్రొడ్యూసర్. ???
Reviewed by firstshowz
on
10:22 am
Rating: 5
No comments