14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ

కడుపుబ్బా నవ్వించే 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మూవీ రివ్యూ

సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మించిన 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రాన్ని శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించారు. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య హీరోగా నటించడంతో వీటితోపాటు విడుదలైన ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇన్ని అంచనాల నడుమ ఈరోజు మనముందుకు వచ్చిన చిత్రం ఈ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.


కథ: 
హర్ష(అంకిత్ కొయ్య) ఫిల్మ్ మేకర్ అవ్వాలి అనుకునే కుర్రాడు. డేటింగ్ ఆప్ లో ఆహాన(శ్రియ కొంతం) ప్రొఫైల్ చూసి తనతో పరిచయం పెంచుకుంటాడు. ఆహాన పేరెంట్స్ ఒక పెళ్లికి వెళ్లడంతో హర్షను ఇంటికి రమ్మంటుంది. అలా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన హర్ష అదే ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆహాన తల్లిదండ్రులకు, తాతాకు తెలియకుండా అన్ని రోజు హర్ష ఇంట్లోనే ఎలా ఉన్నాడు? హర్షను దాచిపెట్టడంలో ఆహాన ఎలాంటి పాట్లు పడింది? పెళ్లికి వెళ్లిన పేరెంట్స్ ఎందుకు తిరిగి వచ్చారు? ఇది మాత్రమే కాకుండా ఆహానకు వచ్చిన మరో సమస్య ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

విశ్లేషణ

ఫిల్మ్ మేకర్ కావాలనుకునే కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుపోతే ఏంటీ పరిస్థితి అనే సింపుల్ పాయింట్ తో కథను అల్లుకున్న తీరు మెప్పించింది. డేటింగ్ అప్ ద్వారా హర్ష, ఆహాన పరిచయం అవడం ఆ తరువాత వాళ్లకు ఎదురయ్యే సమస్య.. ఎక్కువ సమయం తీసుకోకుండా అసలైన పాయింట్ లోకి తీసుకెళ్లారు. కథలో అసలు పాయింట్ హీరో ఇంట్లో లాక్ అవడం. అక్కడి నుంచి కథలు రొమాంటిక్ థ్రిల్లర్ గా మారుతుంది. దొరికిపోతాడేమో అన్న టెన్షన్ ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. 

సినిమాలో 14 రోజులు హీరో ఆహాన ఇంట్లో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఈ కథలో ఒక అద్భుతమైన పాయింట్ ను డిస్కస్ చేశారు. పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోవడం అనే పాయింట్ ను మాట్లాడారు. దీని వలన కథలో మరో సంఘర్షణ మొదలవుతుంది. ఆ సంఘర్షణకు సమాధానమే ఈ సినిమా ముగింపు. ఆ పాయింట్ ను కూడా చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశారు. కథ చివరి వరకు ఆకట్టుకుంది.

నటీనటులు:

అంకిత్ కొయ్య చాలా సెటిల్డ్ గా నటించారు. చాలా రకాల భావోద్వేగాలను చేసే పాత్రలో అంకిత్ నటన ఆకట్టుకుంది. శ్రియ కొంతం నటన మెప్పించింది. తన ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ యాక్టింగ్ చాలా కామెడీ ఉంది. ఆయన ఏ సీన్ లో కనిపించిన నవ్వులు పూజించారు. సినిమా మొత్తంలో 

వెన్నెల కిషోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇంద్రజ పాత్ర కొంతే ఉన్నా పర్వాలేదు అనిపించింది. మిగతా నటీనటులంతా వారి పాత్రల మేరకు అలరించారు.

సాంకేతిక అంశాలు:

శ్రీ హర్ష మన్నే కథను నడిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఒకే చోట కథ సాగుతున్న ఎలాంటి బోరింగ్ లేకుండా కథను నడిపించారు. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. కంచితంగా మంచి విషయం ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సౌండ్ మిక్సింగ్ విభాగంలో గ్రామీ అవార్డును అందుకున్న పీ.ఏ దీపక్ ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. ఎడిటింగ్ బాగుంది. ప్రదీప్ రాయ్ పనితనం మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

కథ
కథనం
యాక్టింగ్
కామెడీ

మైనస్ పాయింట్స్:

నిడివి కొంచం ఎక్కువగా ఉంటే బాగుండేది


నటీనటులు : అంకిత్ కొయ్య, శ్రియ కొంతం, ఇంద్రజ, వెన్నెల కిషోర్, ప్రశాంత్ శర్మ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీ హర్ష మన్నె
బ్యానర్ : త్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సత్య కోమల్
సంగీతం : మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ : కే సోమ శేఖర్ 
ఎడిటర్ : ప్రదీప్ రాయ్
డైలాగ్స్ : దీపక్ రాజ్ ఏ, హిరన్మయి కళ్యాణ్, సరద సాయి చెన్నుభొట్ల
ఆర్ట్ డైరెక్టర్ : వినోద్ రవింద్రన్
పీఆర్ఓ : హరీష్, దినేష్

రేటింగ్: 3.5/5

No comments