ఘనంగా బిగ్ బాస్ యావర్, శుభశ్రీ "ఉసురే" సాంగ్ లాంచ్
బిగ్బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్, శుభశ్రీ రాయగురు జంటగా జయరాం చిటికెల స్క్రీన్ ప్లే దర్శకత్వంలో పని అన్వేష్ సరిక నిర్మాతగా నివృతి వైబ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాట ఉసురే - లవ్ ఈజ్ ఎ లై. సాయి సంవిత్ రచించిన ఈ పాటకు కాలభైరవ తన స్వరాన్ని అందించగా నింస్జాచ్చఐస్ సంగీతాన్ని అందించారు. రా & రస్టిక్ గా ఉన్న ఈ లవ్ సాంగ్ లాంచ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో చేయడం జరిగింది. కార్తీక్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ పాటకు కొండవీటి రవికుమార్ ఎడిటర్గా చేయగా బీమా వదిన పని చేశారు. ఈ కార్యక్రమానికి మెగా కుటుంబ శ్రేయోభిలాషి గంగాధర్ గారు, అలాగే ప్రియాంక జైన్, నైనిక, మణికంఠ, అంజలి, భోలే శవాళి తోపాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అతిథులుగా హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా తేజ మాట్లాడుతూ... "ఒక రస్టిక్ పాటను ఎంత అందంగా సినిమాటిక్ రేంజ్ లో చూపించిన జయరాంకు నా కృతజ్ఞతలు. సంగీతం బలంగా కూడా కేవలం ఒక పాటకు చేస్తున్నట్లు కాకుండా ఒక సినిమా స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. యావర్, శుభశ్రీ గా ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా కృతజ్ఞతలు" అన్నారు.
డి ఓ పి కార్తీక్ మాట్లాడుతూ... "నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నేను యావర్ గారికి పెద్ద అభిమానిని. ఈ పాట కోసం పనిచేసిన నా టీమ్ అందరికీ థాంక్స్" అన్నారు.
సంగీత దర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ బోలె మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ నమస్కారం. ముందుగా మా సీజన్ నుండి కాంటెస్ట్ చేసిన శివాజీ గారికి నా అభినందనలు. ఇటీవల విడుదలైన కోర్టు సినిమాలో ఆయన పర్ఫామెన్స్ నాకు చాలా నచ్చింది. బిగ్బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యావర్, శుభశ్రీ కలిసి ఒక పాట చేయడం అనేది చాలా సంతోషకరం" అన్నారు.
గంగాధర్ గారు మాట్లాడుతూ... "ముందుగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం డైరెక్టర్ జయరాం. ఇతను నాకు చాలా కావాల్సినవాడు. ఈ పాటను చూస్తే ఎక్కడ అడవిలో చాలా కష్టపడి తీసినట్లు అర్థమవుతుంది. కొత్తగా వచ్చేవారి టాలెంటును నిర్మాతలు అంతా కలిసి ఎంకరేజ్ చేయాలి. ఈ పాటలో కనిపిస్తున్న యావర్, శుభశ్రీ చాలా బాగా చేశారు. బృందం అందరికీ నా అభినందనలు" అన్నారు. అదేవిధంగా మార్చి 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న బ్లడ్ క్యాంపైల్లో అభిమానులంతా తమ వంతుగా రక్తదానం చేసి ప్రజాసేవలో పాల్గొనాలని కోరుకున్నారు.
శుభశ్రీ మాట్లాడుతూ... "కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు. నాకు కొంచెం టెన్షన్ గా ఉన్నప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ముందుగా దర్శకుడు జయరాంకు నా కృతజ్ఞతలు. ఆయన నాకు ఈ పాట కోసం కాకినాడ యాస నేర్పించారు. ఒక విధంగా రామ్ చరణ్ గారి రంగస్థలం సినిమాలోని యాసకు దగ్గర ఉండటం నాకు చాలా నచ్చింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను రక్త దానం చేయాలనుకుంటున్నాను. యావర్ తో కలిసి ఈ పాటలో నటించడం చాలా సంతోషకరం. భవిష్యత్తులో కూడా నీతో కలిసి తప్పకుండా పని చేయాలనుకుంటున్నాను. అలాగే ఈ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అన్నారు.
ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ... "ఈ పాట లాంచ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు. జయరాం ఎంతో కష్టపడి చాలా ప్లాన్ చేసుకుని ఈ పాట చేయడం జరిగింది. ఆ సమయంలో నా నుండి కూడా ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చిన తప్పకుండా తీసుకునేవాడు. ఒక పూర్తి చిత్రాన్ని ఎనిమిది నిమిషాల ఆల్బమ్ సాంగ్లో చూపించినట్లుగా తీశాడు. ఈ పాట ఇలా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్. ఈ పాటను అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పాటను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు" అంటూ ముగించారు.
అలాగే ఈ పాట లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ఇతర యూట్యూబర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్, ఇన్ఫ్రాన్సర్స్ ఇంకా ఫ్యాన్స్ అంతా తమకు ఈ పాట చాలా బాగా నచ్చిందని, తప్పకుండా పెద్ద హిట్ అవ్వకుండానే తమ తమ మాటలలో తమ అభిప్రాయాన్ని తెలిపారు.
Post Comment
No comments