స్వయంభు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన సోనుది ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ No 1


సోనుది ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా నటిస్తున్న చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ క్లాప్ కొట్టగా తొలి షాట్ ను దేవుని పటాలపై చిత్రీకరణ జరిగింది. దర్శకులు వీరశంకర్, నవీన్ మేడారం,తనికెళ్ల భరణి చిత్ర దర్శక ద్వయం కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్య లకు స్క్రిప్ట్ ను అందించారు. ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ టి, వంశీ కెమెరా స్విచ్చాన్ చేశారు. 

సినిమా ఓపెనింగ్ తర్వాత విలేకరుల సమావేశంలో నిర్మాత ఆర్ యు రెడ్డి మాట్లాడుతూ- మా బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకులతో మంచి కథతో సినిమా షూటింగ్ ను మార్చి 6 నుండి తొలి షెడ్యూల్ ను ఊటి లో ప్రారంభింస్తున్నాం. తొలి షెడ్యూల్ తర్వాత రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశాం. మా సోనుధి నుండి ఏడాదికి కొన్ని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సమాజం మాకు అండగా ఉండి ఎంతో ఇచ్చింది. మా వంతుగా మేము కూడా సమాజానికి మేలు చేసే మంచి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. మా నటీనటులు, టెక్నీషియన్స్ కి అభినందనలు అన్నారు. 

హీరోయిన్ మానస మాట్లాడుతూ ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. డైరెక్టర్స్ చాలా టాలెంట్ ఉన్నవారు అన్నారు. దర్శకులు కిట్టి కిరణ్, లక్ష్మీ చైతన్యలు మాట్లాడుతూ- మా టాలెంట్ ను నిరూపించుకునే అవకాశం కల్పించిన నిర్మాత ఆర్ యు రెడ్డి గారికి కృతజ్ఞతలు. సినిమాను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, సంధ్య జానక్, కెమెరా మెన్ జోషి తదితరులు పాల్గొన్నారు.

No comments