'కింగ్స్టన్' ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఇంకెంత అద్భుతంగా ఉంటుందో... థియేటర్లలో చూడటానికి వెయిటింగ్ - ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో నితిన్
కోలీవుడ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్న యంగ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన తాజాగా ''కింగ్స్టన్'' మూవీతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో 'బ్యాచిలర్' తరువాత మరోసారి దివ్యభారతి, జీవీ ప్రకాష్ జంటగా కనిపించబోతున్నారు. ఈ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జీ స్టూడియోస్ తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ తన సొంత బ్యానర్ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచింది. తమిళ, తెలుగు భాషల్లో మార్చ్ 7న రిలీజ్ చేయబోతున్నారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో సోమవారం రాత్రి ''కింగ్స్టన్'' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, మరో డైరెక్టర్ వెంకీ అట్లూరి, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గెస్ట్ లుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ 'కింగ్స్టన్' ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. ఇలాంటి స్పెక్టాకులర్ విజువల్స్ అందించినందుకు డైరెక్టర్ కమల్ కు అభినందనలు. ట్రైలరే ఇలా ఉంటే, ఇంకా సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత పెరిగింది. నేను ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. 'కింగ్స్టన్' మూవీ మార్చ్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఇది ఫస్ట్ సీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్. సినిమా ఖచ్చితంగా బాగుండాలని, బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివ్య మీరు తెలుగు చాలా బాగా మాట్లాడారు. మీలాంటి అమ్మాయిలు క్యూట్ క్యూట్ గా అలాంటి తప్పులు చేస్తే మాలాంటి అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. మీ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవాలి. నాకు బాగా క్లోజ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన మహేశ్వర్ రెడ్డి గారు ఈ మూవీని తీసుకున్నారు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి, ఆయనకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.
ఇక హీరో జీవీ ప్రకాష్ విషయానికి వస్తే, నాదో చిన్న ప్రశ్న... మామూలుగా ఏడాదిలో నా సినిమా హీరోగా ఒక్కటి రిలీజ్ అయితే హ్యాపీ నేను. ఒక ఏడాదికి హీరోగా నీ సినిమాలు రెండు మూడు రిలీజ్ అవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా సినిమాలు వస్తాయి. అందులో బ్లాక్ బస్టర్ సాంగ్స్, అవార్డులు వస్తూ ఉంటాయి. నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు? నీ సీక్రెట్ ఏంటి నాకు చెప్తే, నేను వెంకీ నేర్చుకుంటాము" అన్నారు నితిన్.
జీవీ ప్రకాష్ కుమార్ స్పందిస్తూ "ఎలాంటి సీక్రెట్స్ లేవు సార్. నేను రోజు పని చేస్తాను" అని చెప్పుకొచ్చాడు. "అంటే మేము పని చేయమా" అని సెటైర్ వేశారు నితిన్. "మీరు యాక్టింగ్ ప్రిఫర్ చేస్తారా లేదంటే మ్యూజిక్ నా?" అనే నితిన్ ప్రశ్నకు, "మీరు నన్ను ప్రిఫర్ చేసినప్పుడు మ్యూజిక్, షూటింగ్ ఉన్నప్పుడు యాక్టింగ్" అన్నారు జీవీ ప్రకాష్ కుమార్. "రాబిన్ హుడ్ బాగుందా? 'కింగ్స్టన్' బాగుందా? అనే ప్రశ్నకు, "మీరంతా ఉన్నప్పుడు రాబిన్ హుడ్ బావుంది. మీరు వెళ్లిపోయాక 'కింగ్స్టన్' బాగుంది" అని సరదాగా సమాధానం చెప్పారు.
"రాబిన్ హుడ్ మూవీకి మ్యూజిక్ బాగుందా? 'కింగ్స్టన్' కు బాగుందా? నీ మూవీకి బాగా కొట్టుకున్నావా?" అని నితిన్ అడగ్గా, "రాబిన్ హుడ్ మూవీ మ్యూజిక్కే స్పెషల్. కామెడీ యాక్షన్ పోర్షన్ అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికే సినిమా చూశాను. ఈ మూవీ రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఇందులో నితిన్ అద్భుతంగా నటించారు" అని చెప్పుకొచ్చారు జీవీ. "నేను ఈ మూవీ ఈవెంట్ కి నువ్వు పిలిచావనో, లేదంటే వెంకీ పిలిచాడనో రాలేదు. నేను వస్తే నువ్వు బీజీఎం ఇంకా బాగా కొడతావని వచ్చాను" అని నితిన్ అనగానే, "బీజీఎం ఆల్రెడీ అయిపోయింది సార్" అంటూ నవ్వేశాడు జీవీ ప్రకాష్ కుమార్. "మార్చి 7న నువ్వు స్టార్ట్ చేయి... మార్చ్ 28న మేము క్లోజ్ చేస్తాము. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. మన మైత్రి శశి గారు ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి... మార్చ్ 13న నా పుట్టినరోజు కాబట్టి, ఆరోజు పెద్ద పార్టీ ఇస్తాను. 'కింగ్స్టన్' పార్టీ, రాబిన్ హుడ్ పార్టీ ఆ రోజు ఉంటుంది... ఆల్ ది బెస్ట్" అని చెప్పారు నితిన్.
జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ "అందరికీ నమస్కారం... ఆయనతో ఒక్క సినిమానే చేశాను. ఒకే ఒక్క మెసేజ్ తో నితిన్, వెంకీ కుడుముల ఇక్కడి దాకా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. దానికి నేను థ్యాంక్ ఫుల్ గా ఉంటాను. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు వెంకీ కుడుముల గారికి థాంక్స్. మా మూవీ తో పాటు నేను మ్యూజిక్ అందించిన రాబిన్ హుడ్ మూవీ కూడా ఇదే మంత్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి రెండు లవ్ పాటలు రిలీజ్ చేసాము. త్వరలోనే ఒక అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అది నా ఫేవరెట్. నిర్మాత రవిశంకర్ తో 'రాబిన్ హుడ్' మూవీని స్టార్ట్ చేశాను. ఇప్పుడు 'గుడ్ బ్యాడ్ అగ్లీ'కి కూడా పని చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడదాకా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు థాంక్స్ రవి గారు. మూవీని రిలీజ్ చేయబోతున్న డిస్ట్రిబ్యూటర్లు, గంగ ఎంటర్టైన్మెంట్స్ మహేశ్వర్ రెడ్డి గారికి థాంక్స్. నేను ఫస్ట్ కరుణాకరన్ సార్ తో ప్రభాస్ నటించిన 'డార్లింగ్' మూవీతో తెలుగు జర్నీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 'ఉల్లాసంగా ఉత్సాహంగా' లాంటి సినిమాలు కూడా చేశాను. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు వెంకీ అట్లూరి సినిమా 'వాతి'తో రీస్టార్ట్ చేశాను.. ఈ సినిమాలోని 'మాస్టారు' సాంగ్ తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్ అయింది. ఐయాం వెరీ గ్రేట్ ఫుల్ టు యు. 'కింగ్స్టన్' మూవీ ఒక బిగ్ డ్రీమ్. నిర్మాతగా ఇది నా ఫస్ట్ మూవీ. 'హ్యారీ పోటర్' లాంటి మల్టీ యూనివర్స్ సినిమాలు చూసినప్పుడు డ్రీమ్ లోకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. అలాంటి సినిమాలను చూసి ఇన్స్పైర్ అయ్యి, ఈ మూవీని తీసాను. కానీ ఏ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టలేదు. అలాంటి స్టాండర్డ్స్ ఉన్న విజువల్స్ వండర్ మూవీని తీయాలని అనుకున్నా. 'కింగ్స్టన్' దానికి కేవలం స్టార్టింగ్ పాయింట్. త్వరలో చాలా పార్ట్స్ రాబోతున్నాయి. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ కి ఇదొక డ్రీం ప్రాజెక్ట్. మాతో అసోసియేట్ అయినందుకు, ఈ మూవీని కో-ప్రొడ్యూస్ చేసినందుకు జీ స్టూడియోస్ వాళ్లకు థాంక్స్. కంప్లీట్ యాక్టింగ్ టీం, టెక్నికల్ టీం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ థాంక్స్. 'బ్యాచిలర్' తర్వాత దివ్యభారతి, నా కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇదే. మీ అందరికీ ఈ సినిమా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇదొక బిగ్ స్క్రీన్ పై చూడాల్సిన సినిమా. ఈ మూవీని మార్చి 7న అందరూ థియేటర్లలో చూడండి. తెలుగులో రిలీజ్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ "'కింగ్స్టన్' టీజర్ ని జీవీ ప్రకాష్ కుమార్ 7-8 మంత్స్ బ్యాక్ చూపించారు. ఆయన చెప్పిన బడ్జెట్, విజువల్స్ చూసి షాక్ అయ్యాం. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ప్రపంచంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు కదా అన్నంత మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఇలాంటి అద్భుతమైన మూవీని థియేటర్లలోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. సంవత్సరాల తరబడి ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో... కరోనా టైం నుంచి బెస్ట్ క్వాలిటీ తీసుకురావడానికి ఈ సినిమాపై పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందినట్టుగా అనిపిస్తోంది. ఈ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ "నేను 'లక్కీ భాస్కర్' మూవీ నుంచి స్టార్ట్ చేసినప్పుడు 'కింగ్స్టన్' మూవీ స్టార్ట్ అయింది. ఈ బడ్జెట్ లో ఇంతటి క్వాలిటీ మూవీ రావడం నాకు సర్ప్రైజ్ గా ఉంది. ఒక అద్భుతమైన సీజీ రిలేటెడ్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కమల్ ను మెచ్చుకోవాల్సిందే. నెంబర్స్ చెప్పలేను. కానీ డీసెంట్ బడ్జెట్లో ఈ సినిమా ఇంత క్వాలిటీతో రావడం సర్ప్రైజింగ్ గా ఉంది. నిజంగా సీజీ టీంకి కాంగ్రాట్స్. ప్రొడక్షన్ టీం దినేష్, భవ్య గారికి అందరికీ కంగ్రాచులేషన్స్. నేను దాదాపు ఎనిమిదేళ్ల పాటు స్ట్రగుల్ అయ్యాను ఒక్క ఛాన్స్ కోసం. కానీ నువ్వు ఓ న్యూ డైరెక్టర్ కి లైఫ్ ఇవ్వడం మంచి విశేషం. తెలుగులో హీరోయిన్ దివ్య సినిమాలు చేస్తుందని ఆశిస్తున్నాను. జీవీతో సినిమాలు చేసిన స్టార్స్ అందరూ ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు దివ్య, ఇంతకుముందు మమిత బైజు, 'డియర్' నటించిన ఐశ్వర్య ఇటీవల 300 కోట్ల సినిమా చేసింది... ఇలా వీళ్లంతా పెద్ద హీరోయిన్లు అయిపోయారు. శశి సార్ ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు తమిళ్ నుంచి తెలుగు లేదా స్ట్రైట్ తెలుగు కూడా కావచ్చు... క్రికెట్ లో పర్పుల్ బ్యాచ్ అంటారు. అది ఇంకా చాలా రోజులు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి సినిమాలను సపోర్ట్ చేస్తున్న జీ స్టూడియోస్ కు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ "బేసిగ్గా జీవీ ఒక గొప్ప జీవి అండి. జనరల్ గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి కాల్ చేసి ఎక్కడున్నావంటే... బ్రో నేను స్టూడియోలో ఉన్నాను లేదా ఇంట్లో ఉన్నాను అని చెప్తారు. కానీ జీవీకి కాల్ చేస్తే... ఒకసారి బ్రో నేను స్టూడియోలో ఉన్నాను అంటారు. మరోసారి లొకేషన్ లో ఉన్నాను అంటారు. కానీ ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆయన ఎక్కడున్నా సరే కాల్ ఆన్సర్ చేస్తారు. కలిస్తే అక్కడే కంపోజింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఒక డేలో 24 అవర్స్ ని ఇంత బాగా ప్లాన్ చేసుకున్న మనిషిని నేను ఎప్పుడూ చూడలేదు. జీవీ ప్రకాష్ ను నేను ముందే కలిసి ఉంటే ఈ ఐదేళ్ల గ్యాప్ నాకు వచ్చి ఉండేదే కాదు. జీవీ బ్రో ఒక ఎంత టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ అంటే... ఆయన మ్యూజిక్ కి నేను బిగ్ ఫ్యాన్. యాక్టింగ్, కెమెరా, లెన్సెస్ మీద కమాండ్ ఉంది. రెండూ కట్ చేస్తే, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. వెరీ ఫ్యాషనేట్ పర్సన్. 'కింగ్స్టన్' విజువల్స్ చూసినప్పుడు స్టన్నింగ్ గా అనిపించింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. దీని మీద బెట్ చేసిన మహేశ్వర్ రెడ్డి గారికి, జి స్టూడియోస్ వాళ్లకి బాగా డబ్బులు రావాలని, వస్తాయని నమ్ముతున్నాను. మార్చి 7న 'కింగ్స్టన్' చూడండి అందరూ. ఈ మూవీతో జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కి సపరేట్ గా తెలుగులో ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ మూవీతో హీరోగా కూడా ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది. ఆల్ ది బెస్ట్ 'కింగ్స్టన్' టీంకి" అన్నారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ "మూడు రోజుల ముందే 'కింగ్స్టన్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మహేశ్వర్ రెడ్డి గారు తీసుకొచ్చిన ట్రైలర్ ని చూసాము. అద్భుతంగా ఉంది. ఈ మూవీని స్క్రీన్ పై చూసి ప్రేక్షకులు అద్భుతంగా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూడాలని, మూవీ కచ్చితంగా పెద్ద హిట్ కావాలని కోరుతున్నాను" అన్నారు.
No comments