మా టీచర్ నర్రా రాంబాబు లెక్కలతో గేమ్స్ ఆడేవారు– బాబిసింహా
29 ఏళ్ల తర్వాత ఆయన్ను కలిశాను...
తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు సోమవారం ప్రముఖ మ్యాథ్స్ టీచర్ నర్రా రాంబాబుగారిని గౌరవ పూర్వకంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో కలిశారు.
ఆయన్ను కలిసిన తర్వాత బాబిసింహా ఎమోషనల్‌గా స్పందించి రాంబాబుగారి గురించి ఇలా అన్నారు. సింహా మాట్లాడుతూ "అమ్మా,నాన్నల తర్వాత మనం పూజించేది గురువులనే. నాకు అలాంటి గురువు నార్ర రాంబాబుగారు.
ఆయన మాకు పాఠాలతో పాటు లైఫ్‌లో ఎలా నడుచుకోవాలో కూడా నేర్పించారు. ఆయన నేర్పిన డిసిప్లీన్ వల్లే నా జర్నీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. 29 సంవత్సరాల తర్వాత ఆయన్ని కలిసి మాట్లాడి తన యోగక్షేమాలు కనుక్కున్నాను.
ఆయన్ని కలిసిన తర్వాత వ్యక్తిగతంగా నేను ఎంతో ఎమోషన ల్‌గా ఫీలయ్యానో మీ అందరితో పంచుకోవాలి అనిపించింది’’ అన్నారు.
No comments