'నీరు కుళ్ళ' చిత్ర రివ్యూ & రేటింగ్

బిట్ల ఫిలిమ్స్ బ్యానర్ పై రమేష్ ప్లస్సి దర్శకత్వంలో కృష్ణ ప్రసాద్ బిట్ల నిర్మాతగా ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నీరు కుళ్ల. ఆర్కే మాస్టర్, రిద్ధి ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తూ డ్రామా థ్రిల్లర్ జోనస్లో రమణ సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈ చిత్ర విశేషానికి వస్తే... 

కథ: 

కొన్ని వాస్తవక సంఘటన ఆధారంగా నీరు కుళ్ళ అనే గ్రామంలోని జరిగే కథగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామంలో పూజించే దైవ విగ్రహాన్ని దొంగలించడం జరుగుతుంది. ఆ సంఘటన సినిమాలోని హీరో మిత్రుడు విచిత్రమైన పరిస్థితులలో మరణానికి దారి తీస్తుంది. అది తెలుసుకున్న హీరో వెంటనే తన స్నేహితుడి మరణానికి గల కారణమేంటని, జరిగిన దొంగతనం గురించి తెలుసుకోవడానికి తన గ్రామానికి తిరిగి వస్తాడు. అలా మొదలైన ఇన్వెస్టిగేషన్ ద్వారా హీరో ఏం తెలుసుకుంటారు? ఇది వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి? చివరికి తన స్నేహితుడి మరణానికి గల కారణం తెలుసుకుంటాడా లేదా? దొంగలించబడిన దైవగ్రహం దొరుకుతుందా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపి చూడాల్సిందే. 

నటీనటుల నటన: 

ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటించిన ఆర్కే మాస్టర్, రిద్ధి ఒబెరాయ్ దగ్గరనుండి చిత్రంలో నటించిన చిన్న చిన్న పాత్రలు పోషించిన ప్రతి ఒక్కరు తమ పాత్రలకు తగ్గ న్యాయం చేయడం జరిగింది. ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్స్ని అలాగే సిచువేషన్ని ఎంతో చాకచక్యంగా ముందుకు నడిపిస్తూ చిత్రాన్ని ముందుకు సాగిన చేశారు. 

సాంకేతిక విశ్లేషణ: 

కథను చక్కటి దర్శకత్వంతో ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెరపైకి ఎక్కించారు దర్శకుడు. అంతేకాక తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా నిర్మాణం విలువలకు లోటు లేకుండా ప్రతిచోట అద్భుతమైన నిర్మాణ విలువలతో రావడం గొప్పతనం చెప్పుకోవాలి. అదేవిధంగా సిచువేషన్ కు తగ్గట్లు బిజిఎం అందిస్తూ చిత్తంలో మరింత ఇంటర్సిటీ వచ్చేలా సంగీత దర్శకుడు జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రాన్ని తన కెమెరాలు బంధించి తెలపై చూపించడానికి తనదైన శైలిలో రమణ సక్సెస్ అయ్యారు. అదేవిధంగా నాచురల్ లొకేషన్స్ లో, చక్కటి కలరింగ్ తో ప్రతి ఫ్రేమ్ లోనూ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైన చిత్రాన్ని అందించారు. 

ప్లస్ పాయింట్స్: 

కథ, దర్శకత్వం, సంగీతం, నటీనటుల నటన 


రేటింగ్: 3.5/5

1 comment: