‘ఓ అందాల రాక్షసి’ పాజిటివ్ మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది.. సక్సెస్ మీట్‌లో చిత్రయూనిట్

దర్శకుడిగా, హీరోగా, సంగీత దర్శకుడిగా, కథకుడిగా షెరాజ్ మెహదీకి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఆయన తాజాగా మార్చి 21న ‘ఓ అందాల రాక్షసి’ అంటూ అందరి ముందుకు వచ్చారు. షెరాజ్ మెహదీ హీరోగా.. విహాన్షి హెగ్డే, కృతి వర్మలు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్ మీద సురీందర్ కౌర్ నిర్మాతగా.. తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా షేర్ సమర్పణలో తెరకెక్కించారు. మార్చి 21న రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ .. ‘నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టుగానే సినిమా పెద్ద సక్సెస్ అయింది. షెరాజ్‌ను చూసి చాలా మంది నిర్మాతలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. చిన్న చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు కూడా సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. మంచి మౌత్ టాక్ రావడంతో షోలు, స్క్రీన్‌లు, కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఈ సినిమా జనాల్లోకి వెళ్లింది. అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ఈ చిత్రం మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’ సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమా జనాల్లోకి మరింతగా రీచ్ అవ్వాలి. మీడియా సపోర్ట్ ఉంటే ఈ సినిమా మరింత ముందుకు వెళ్తుంది. షెరాజ్ ఈ మూవీని నిలబెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. నా రైటింగ్, స్క్రీన్ ప్లేని అందరూ మెచ్చుకుంటున్నారు. మా చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

షెరాజ్ మెహదీ మాట్లాడుతూ .. ‘‘ఓ అందాల రాక్షసి’మంచి సందేశం ఇచ్చేలా ఉందని ప్రేక్షకులంతా ప్రశంసిస్తున్నారు.  మా చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌‌కు థాంక్స్. మా మూవీ మరింత పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

కృతి వర్మ మాట్లాడుతూ .. ‘మా సినిమాతో పాటుగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆడియెన్స్ మా మూవీని ఆదరించారు. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. నా తొలి చిత్రమే ఇంత పెద్ద హిట్ అవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

విహాన్షి హెగ్డే మాట్లాడుతూ .. ‘నా ఫ్యామిలీతో కలిసి సినిమాను చూశాను. థియేటర్లో మా చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

No comments