ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా నటిస్తోన్న చిత్రం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి, ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే అనేక అంశాలతో దర్శకుడు ఎన్. కె ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్ర టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఘనంగా జరిగింది, ఈ ప్రోగ్రామ్ లో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ...
డైరెక్టర్ ఎన్.కె గారు సినిమాను బాగా డీల్ చేశారు, సినిమాను ఎక్కడా గ్యాప్ లేకుండా నిరంతరం కృషి చేస్తూ అందంగా తీర్చి దిద్దారు. నిర్మాత త్రినాధ్ గారు సినిమాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తీశారు, సుహాన తెలుగు రానప్పటికీ బాగా నటించింది. పాడేరు 12వ మైలు సినిమాలో నేను శ్రవణ్, ప్రభాకర్ గుర్తిండిపోయే రోల్స్ చేశాం, త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది, మంచి సినిమా కోసం అందరం ఎదురు చూద్దాం అన్నారు.
శ్రవణ్ మాట్లాడుతూ...
పాడేరు 12వ మైలు కథ విన్నప్పుడు చాలా నచ్చింది, పాడేరు మొదకొండమ్మ తల్లి పవర్ ను ఈ సినిమాలో చక్కగా చూపించారు. డైరెక్టర్ ఎన్. కె గారు నిర్మాత త్రినాధ్ గారు మంచి సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమాను నటించినందుకు సంతిషంగా ఉందన్నారు.
డైరెక్టర్ ఎన్. కె మాట్లాడుతూ...
నా స్నేహితుడు త్రినాధ్ నిర్మాతగా నేను డైరెక్టర్ గా మీ ముందుకు పాడేరు 12వ మైలు సినిమాతో వస్తున్నాను. సత్యం రాజేష్, ప్రభాకర్, శ్రవణ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాము. మాకు సపోర్ట్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను అన్నారు.
నిర్మాత గ్రంధి త్రినాధ్ మాట్లాడుతూ...
పాడేరు 12వ మైలు సినిమా బాగ వచ్చింది, డైరెక్టర్ , యాక్టర్స్ అందరూ బాగా సపోర్ట్ చెయ్యడంతోనే మా సినిమా ఇంత కలర్ ఫుల్ గా ఉంది, శ్రీ పాడేరు మొదకొండమ్మ తల్లి బ్లెస్సింగ్స్ మా పై ఎప్పుడూ ఇలానే ఉండాలని, ప్రేక్షకులు, మీడియా వారు మా సినిమాను తప్పకుండా పాజిటీవ్ గా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉందని అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్ శివ శర్వాని అలాగే సినిమాటోగ్రఫీ జి. అమర్ అందిస్తున్నారు ఈ మూవీ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్నాయి. గడ్డం నవీన్, షేకింగ్ శేషు, ముకేష్ గుప్త, కె.ఏ.పాల్ రాము, సూర్య, సమీర్, చిట్టిబాబు, మురళి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.
హైదరాబాద్, వైజాగ్ మరియు పాడేరు లో అధిక భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్ లోకి రానుంది. పీఆర్ ఈ సినిమాకు నేపధ్య సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.
ఘనంగా పాడేరు 12వ మైలు టీజర్ లాంచ్ కార్యక్రమం !!!
Reviewed by firstshowz
on
11:54 am
Rating: 5
No comments