మొహాలు చూపించకుండా సినిమాను తీయడం అనేది ఇదివరకు వరల్డ్ వైడ్‌గా ఎవ్వరూ సాహసం చేయని ఓ జానర్. ఇలా ఆర్టిస్టుల్ని చూపించకుండా, అసలు ఎవ్వరూ కనిపించకుండా సినిమాను చూపించడం మామూలు విషయం కాదు. కానీ అలాంటి ఓ విభిన్న ప్రయత్నం చేస్తూ తీసిన చిత్రమే ‘రా రాజా’. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ తెరకెక్కించిన చిత్రం ‘రా రాజా’. ఈ చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ చిత్రాన్ని మార్చి 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
దర్శక, నిర్మాతగా మీ ప్రయాణం గురించి చెప్పండి?
మాతృ సినిమాతో నిర్మాతగా మారాను. అయితే ఆ సినిమా టైంలోనే నాకు ఈ ‘రా రాజా’ ఆలోచన వచ్చింది. అలా నేనే నిర్మాతగా, దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభించాను.
మొహాలు చూపించకుండా సినిమా తీయడం అనే ఆలోచన ఎలా వచ్చింది?
ప్రస్తుతం ఆడియెన్స్ ఎవ్వరూ కూడా హీరో హీరోయిన్ల పేర్లు, మొహాలు చూసి సినిమాలకు రావడం లేదు. ట్రెండ్ మారింది. కథ నచ్చితే, కంటెంట్ బాగుంటేనే మూవీని చూస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్, కథా ప్రాథాన్యమున్న చిత్రాన్ని తీయాలని అనుకున్నాను. అందుకే ఈ ‘రా రాజా’ని ప్రారంభించాను.
ఆర్టిస్టులెవ్వరూ కనిపించని ఈ ‘రా రాజా’ ఎలా ఉండోబోతోంది?
సినిమాలో నటీనటులు ఎవ్వరూ కనిపించకపోయినా అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆడియెన్స్ ఫీల్ అవుతారు. లవ్, కామెడీ, హారర్ ఇలా ప్రతీ ఒక్కటీ ఇందులో ఉంటుంది. ఆద్యంతం అలరించేలా, అందరినీ చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది.
‘రా రాజా’ సినిమా కెమెరా వర్క్ గురించి చెప్పండి?
రా రాజా సినిమాకి టెక్నికల్ టీం బలం. కెమెరామెన్ రాహుల్ శ్రీ వాత్సవ్ వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఆయనతో పని చేయడం చాలా ఈజీ. దర్శకుడికి ఏం కావాలో తెలుసుకుని పని చేస్తుంటారు. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది.
‘రా రాజా’ మ్యూజిక్ ఎలా ఉండబోతోంది?
శేఖర్ చంద్ర గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. శేఖర్ చంద్ర గారు ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్లస్ అవుతుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తరువాత అందరూ ఆయన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారు. కొత్త శేఖర్ చంద్ర గారిని అందరూ చూడబోతున్నారు.
చివరగా ఆడియెన్స్‌కి ‘రా రాజా’ గురించి ఏం చెప్పదల్చుకుంటున్నారు?
రా రాజా చిత్రాన్ని థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం తీశాం. చాలా కష్టపడి ఈ మూవీని చేశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది. ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఆర్టిస్టుల మొహాలు కనిపించడం లేదే? అనే భావన మాత్రం కలగదు. చివరి వరకు ఎంగేజ్ చేసేలా ఉంటుంది. మేం చేసిన ఈ ప్రయోగాన్ని అందరూ ఆదరించండి.
ప్రయోగాత్మకమైన చిత్రమైన ‘రా రాజా’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది : దర్శక, నిర్మాత బి. శివ ప్రసాద్
Reviewed by firstshowz
on
9:17 pm
Rating: 5
No comments