స‌మంత ట్రా లా లా మూవింగ్ పిక్చ‌ర్స్ రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ టీజర్ విడుదల


సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూ, భ‌య‌పెడుతూ, ఉత్కంఠ‌త‌కులోను త‌గిన స‌న్నివేశాలు, యూనిక్ స్టోరీతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్త‌టానికి సిద్ధంగా ఉంది.

‘శుభం’ చిత్రంలో ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు అద్భుత‌మైన న‌ట‌న‌తో క‌థ‌లోని పాత్ర‌ల‌కు జీవం పోశారు. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా న‌వ్విస్తూ, థ్రిల్లింగ్ సన్నివేశాల‌తో మెప్పిస్తూ పూర్తి వినోదాత్మ‌క కుటుంబ క‌థా చిత్రంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. వివేక్ సాగ‌ర్ అద్భుత‌మైన సంగీతం మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ వేస‌విలోనే సినిమాను విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు

ఈ సంద‌ర్భంగా స‌మంత స్పందిస్తూ ‘‘ప్రేక్షకులు మా అందరి కష్టాన్ని వెండితెరపై వీక్షించి ఆశీర్వ‌దిస్తార‌ని అంద‌రం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ‘శుభం’ సినిమా కోసం ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. దాన్ని మీ అంద‌రితో షేర్ చేసుకోవ‌టానికి మేం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాం’’ అన్నారు.

ఈ వేస‌విలో న‌వ్వుల‌తో కూడిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘శుభం’ వంటి సినిమాటిక్ రోల‌ర్ కోస్ట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అనుభ‌వించ‌టానికి సిద్ధంగా ఉండండి

న‌టీన‌టులు:  

హ‌ర్షిత్ రెడ్డి, గ‌విరెడ్డి శ్రీనివాస్‌, చ‌ర‌ణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి ల‌క్ష్మి, షాలిని కొండెపూడి, వంశీధ‌ర్ గౌడ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ కండ్రెగుల‌
నిర్మాత‌: ట‌్రా లా లా మూవింగ్ పిక్చ‌ర్స్‌
క‌థ‌: వ‌సంత్ మారింగంటి
కో ప్రొడ‌క్ష‌న్‌: క‌న‌క‌వ‌ల్లి టాకీస్‌
ఎడిటింగ్‌, ధ‌ర్మేంద్ర కాక‌రాల‌
సినిమాటోగ్ర‌ఫీ: మ‌్రిదుల్ సుజిత్ సేన్‌
సంగీతం: క‌్లింటోన్ సెరెజొ
బ్యాగ్రౌండ్ స్కోర్‌: వివేక్ సాగ‌ర్
ప్రొడ‌క్ష‌న్ డిజైనర్‌: రామ్ చ‌ర‌ణ్‌తేజ్ ల‌బాని
వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్‌వైజ‌ర్‌: నిఖిల్ కోడూరు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రాకేష్ రెడ్డి గడ్డం
లైన్ ప్రొడ్యూస‌ర్‌: ఆర్య‌న్ ద‌గ్గుబాటి
పాట‌లు: ర‌హ‌మాన్
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పూజిత తాడికొండ‌
కో డైరెక్ట‌ర్‌: ప్ర‌వీణ్ రాచెప‌ల్లి
వి.ఎఫ్‌.ఎక్స్‌: పిక్స‌ల్ మ‌యాన్‌, కో స్టూడియోస్‌
సౌండ్ డిజైన్‌: అక్ష‌య్ పాటిల్‌
సౌండ్ మిక్సింగ్: అజిత్ అబ్ర‌హం జార్జ్‌
డిఐ: సార‌థి స్టూడియోస్‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా
ప‌బ్లిసిటీ డిజైన్స్‌: ప్రాతా నారంగ్‌
విజువ‌ల్ ఆర్టిస్ట్‌: అంకిత్ మిత్ర

No comments