అమర్ దీప్ చౌదరి హీరోగా విజన్ మూవీ మేకర్స్ మూడో సినిమా 'సుమతీ శతకం' పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం


అలా నిన్ను చేరి, సన్నీ లియోన్ మందిర సినిమాలను నిర్మించి విజయాన్ని అందుకుంది విజన్ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ మీద మూడో సినిమాగా 'సుమతీ శతకం' రాబోతుంది. ఈ మూవీని కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తుండగా.. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎం. ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్లు ప్రకటించారు.

ఈ సినిమాకి బండారు నాయుడు కథను అందించారు. ఈ మూవీకి సంగీతాన్ని సుభాష్ ఆనంద్ సమకూర్చుతున్నారు. ఈ సినిమాకి కెమెరా మెన్ హలేష్, ఎడిటర్ సురేష్ విన్నకోట. 

నటీనటులు : అమర్ దీప్ చౌదరి, సైలీ చౌదరి తదితరులు 

సాంకేతిక బృందం 

బ్యానర్: విజన్ మూవీ మేకర్స్ 
సమర్పణ: కొమ్మాలపాటి శ్రీధర్ 
నిర్మాత : కొమ్మాలపాటి సాయి సుధాకర్
దర్శకుడు: ఎం. ఎం. నాయుడు 
సంగీతం: సుభాష్ ఆనంద్ 
Dop: హలేష్ ఎస్ 
ఎడిటర్: సురేష్ విన్నకోట 
రచయిత: బండారు నాయుడు 
పి.ఆర్.ఓ: సాయి సతీష్

No comments