భారత్‌లో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 లక్షలాది మందికి వినోదాన్ని అందిస్తోంది. ZEE5 తన సబ్ స్క్రైబర్లకు, సబ్ స్క్రైబర్లు కాని వారికీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. మనోరంజన్ ఫెస్టివల్‌ను ప్రారంభిస్తోంది. ఈ మార్చిని అద్భుతంగా మార్చడానికి ZEE5 సిద్ధంగా ఉంది. మార్చి 1 నుండి 30 వరకు ZEE5ని ఉచితంగా వాడుకోవచ్చని ప్రకటించింది. ఇందులో అనేక బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు, ఎమోషనల్ డ్రామాలు, కామెడీ ఎంటర్టైన్మెంట్‌లు, హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రాలన్నింటినీ ఉచితంగా చూడొచ్చు.
ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ ద్వారా ఎంతో మంది ఉచితంగా ఎంతో వినోదాన్ని పొందనున్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా ZEE5 మరింతగా తన సబ్ స్క్రైబర్లను ఎంటర్టైన్ చేయనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ పండుగ ప్రచారంలో రక్షా బంధన్, హడ్డీ, కిసి కా భాయ్ కిసి కి జాన్, ఉంచాయ్, కడక్ సింగ్, ఖుదా హాఫిజ్ చాప్టర్ 2 : అగ్ని పరీక్ష, అటాక్ పార్ట్ 1, లవ్ హాస్టల్, ఛత్రివాలి, ఖిచ్డి 2: మిషన్ పాంతుకిస్తాన్ (హిందీలో), యానై, విక్రమ్ (తమిళంలో), సూపర్ శరణ్య, ఇని ఉత్తరం, ప్రణయ విలాసం, క్వీన్ ఎలిజబెత్ (మలయాళంలో ), బేబ్ భాంగ్రా పౌండే నే (పంజాబీలో ), ఘోస్ట్ (కన్నడలో ) వంటి ఎన్నో చిత్రాలను ఉచితంగా వీక్షించవచ్చు.
ZEE5 ప్రతినిధి మాట్లాడుతూ .. ‘ZEE5లో ప్రపంచ స్థాయి వినోదాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఎక్కువ వినోదాన్ని అందించేందుకు మేం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ ద్వారా ఉచితంగా వినోదాన్ని అందించడమే మా లక్ష్యం ఏంటో అందరికీ అర్థమై ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి ప్రీమియం కంటెంట్‌ను అందిస్తున్నాం. ‘హర్ స్క్రీన్ రంగీన్’తో, మార్చి అంతా సినిమాలని చూసి ఎంజాయ్ చేయాలి. ఈ హోలీకి ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ కుటుంబాన్ని ఒక చోట చేర్చి పండుగను జరిపించేలా వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నామ’ని అన్నారు.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు యంగస్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
ZEE5 మనోరంజన్ ఫెస్టివల్ కానుక.. మార్చి 1 నుంచి 30 ఉచితంగా ఎంటర్టైన్మెంట్
Reviewed by firstshowz
on
1:10 pm
Rating: 5
No comments